హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్‌మిల్లుల తనిఖీల్లో నిల్వల వ్యత్యాసాలు?

GDWL: జిల్లాలో ఎఫ్‌సీఐ తనిఖీలతో రైస్‌మిల్లుల వ్యవహారం చర్చనీయాంశమైంది. బీరోల్లి రహదారిలోని ఓ మిల్లులో 30 వేలకుపైగా ధాన్యం బస్తాల లెక్కల్లో తేడాలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలను ప్రభావితం చేసేందుకు ముడుపుల వ్యవహారం నడిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.