హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగి కోర్టు వద్ద ప్రమాదకర గుంత

VKB: పరిగి కోర్టు సమీపంలోని రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. గుంత పడిన ప్రతిసారీ అధికారులు తాత్కాలికంగా మట్టి వేస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతకు శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.