హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం

NLG: దేవరకొండ నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి అజారుద్దీన్‌ను ఎమ్మెల్యే బాలునాయక్ కోరారు. నియోజకవర్గంలోని ముస్లిం, క్రైస్తవ మైనారిటీల సామాజిక, సాంస్కృతిక అవసరాలను తీర్చేందుకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆదివారం వినతిపత్రం అందజేశారు. 4 కమ్యూనిటీ హాల్ లకు ప్రతిపాదనలు చేశారు.