హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి'

NRPT: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నారని జిల్లా సాధన సమితి కోకన్వీనర్ నరసింహ అన్నారు. ఆదివారం ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని కోరారు.