హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లారెడ్డి పాఠశాలల అభివృద్ధికి నాబార్డ్ నిధులు

KMR: ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాల్లో 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాబార్డ్ నిధులు విడుదలయ్యాయి. నూతన భవనాల నిర్మాణం,మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు మెరుగైన వసతులు అందనున్నాయి. నిధుల విడుదలతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు మార్గం సుగమమైంది.