హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనకదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

BHPL: భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గామాత అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.