VKB: దోమ మండలం మోత్కూరు విద్యుత్ సబ్స్టేషన్లో జూనియర్ లైన్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫీడర్లకు ఆయుధ పూజ నిర్వహించి, నూతన ఫీడర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులకు కండువాలు కప్పి, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆనంద్, విద్యుత్ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన విద్యుత్ ఫీడర్ ప్రారంభం


