WGL: వర్ధన్నపేట పట్టణంలోని రంగలీలా మైదానంలో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పరిశీలించారు. బతుకమ్మ వేదిక, నిమజ్జన స్థలాన్ని పరిశీలించి, పండుగకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ, దసరా ఏర్పాట్లను పరిశీలించిన BRS


