హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిండి ప్రాజెక్టు నీటి కేటాయింపుపై జిల్లాల మధ్య విభేదాలు

NLG: దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిపాదించిన డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రతిపాదనపై ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.