హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డుకు రూ.11 కోట్లు: ఎమ్మెల్యే

KNR: గన్నేరువరం మండల ప్రజలకు పండుగ వేళ శుభవార్త అందింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. దసరా తర్వాత పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ సుముఖత వ్యక్తం చేశారు. రహదారి సమస్యను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభలో ప్రస్తావించి నిధుల విడుదలకు కృషి చేశారు.