హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'భోజనశాల పునర్నిర్మాణానికి కృషి చేస్తాం'

NZB: బోధన్‌లోని శ్రీ చక్రేశ్వర శివాలయాన్ని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న భోజనశాలను పరిశీలించి, పునర్నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆలయ ఖాళీ స్థలానికి కంచె ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.