హైదరాబాద్: 28°C
తెలంగాణ

చందూర్ మండలంలో ఎండలు భగభగ

NLG: చందూర్ మండలంలో ఉదయాన్నే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. తెల్లవారుజామున చల్లగా ఉన్న వాతావరణం సూర్యుడు ఉదయించే సమయానికి భగభగ మండుతోంది. ఆదివారం ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదైంది. చలికాలం మొదట్లోనే ఇంత ఎండ ఉంటే రానున్న రోజుల్లో మరింత వేడి ఉండవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎల్ నీనో ప్రభావం వల్ల ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు.