హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గాభవాని ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

KNR: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీశ్రీశ్రీ దుర్గాభవాని దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.