హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని పోచమ్మ చెరువు వద్ద సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్లను బెల్లంపల్లి ACP కిరణ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఘాట్ల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తగినంత వెలుతురు, భద్రత ఏర్పాటు, నీటి సౌకర్యం అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.