హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోర్ ఫాదర్స్ పబ్‌కు జలమండలి షాక్

HYD: నగరంలో తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌లోని ‘ఫోర్ ఫాదర్స్ పబ్’ నీటిని వృథా చేయడంతో అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు. తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు ట్యాంకర్ల సరఫరాను నిలిపివేశారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.