హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహం

BHPL: భూపాలపల్లిలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగస్వాములవుతున్న కార్మికులకు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు దుస్తులు, భద్రతా సామగ్రి అందజేశారు. మహిళా సిబ్బందికి చీరలు, పురుష కార్మికులకు ఖాకీ యూనిఫాంలతో పాటు కొబ్బరి నూనె, సబ్బులు, బెల్లం, చెప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య, కమిషనర్ ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.