హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వృథాగా మిషన్‌ భగీరథ నీరు

BHPL: గణపురం మండల కేంద్రంలో ఆదివారం పైపులైన్‌ లీకేజీతో మిషన్‌ భగీరథ నీరు వృథాగా పోతోంది. ఓవైపు ఎల్‌నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడాలని ప్రభుత్వం సూచిస్తుండగా, మరోవైపు పైపులైన్‌ లీకేజీతో నీరు వృథా అవుతుండటంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్‌కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.