హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి జలాలు కొనసాగించాలి: రైతు సంఘం

KMM: ఏన్కూరు మండలం రాయమాధరం వరకు గోదావరి జలాల సరఫరా కొనసాగించి పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షుడు దుగ్గి కృష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. మరో నెలపాటు సాగునీరు అందించాలని, ఏన్కూరు మండలాన్ని కరువు జాబితాలో చేర్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.