హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై గుంతల పూడ్చివేత

PDPL: పెద్దపల్లి నుంచి జూలపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు, నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేశ్ తన సొంత ఖర్చులతో గుంతలు పూడ్చి మరమ్మతులు చేపట్టారు. ఆయన చొరవతో రహదారి ప్రయాణానికి అనుకూలంగా మారడంతో వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.