హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ మేయర్ అభ్యర్థి

ATP: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో YCP మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నివాసం నుండి ఆయనతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ అభ్యర్థిత్వాన్ని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, మాజీ మేయర్ వసీం సలీమ్ బలపరిచారు.