TPT: తిరుపతి రూరల్ తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజైన ఆదివారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో స్థానికులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సూర్యప్రభ వాహనంపై కళ్యాణ వెంకన్న


