హైదరాబాద్: 28°C
వార్తలు

తొక్కిసలాట.. పలు మండపాల్లో పూజలు నిలిపివేత

కోల్‌కతా తొక్కిసలాట తరుణంలో పలు మండపాల నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాలా ప్రత్తయ్, కాలేజ్ స్క్వేర్, ఎండీ అలీ పార్క్ తదితర మండపాల వద్ద దుర్గా పూజలను నిలిపివేశారు. నిన్న చోర్ బగాన్ ఘటన జరిగిన కొద్దిసేపటికే చేత్లా అగ్రణి మండపం వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో నిర్వాహకులు మండపం లోపల ఉన్నవారిని బయటకు పంపించారు.