హైదరాబాద్: 28°C
వార్తలు

శబరిమల, మాళికాపురం ఆలయాలకు నూతన అర్చకులు

శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం, మాళికాపురం దేవి ఆలయాలకు కొత్త ప్రధాన అర్చకులను ఎంపిక చేశారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడిగా అరీక్కర సుబ్రమణ్యన్ శంకరన్ నంబూద్రి, మాళికాపురం ప్రధాన అర్చకుడిగా అయడత్ ఇల్లం దామోదరన్ నంబూద్రి నియమితులయ్యారు. సంప్రదాయబద్ధంగా లాటరీ పద్ధతి ద్వారా అర్చకుల ఎంపికను చేపట్టారు.