హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధనలక్ష్మి రూపంలో విరుపాక్షి మారెమ్మ దివ్యదర్శనం

CTR: శరన్నవరాత్రుల్లో భాగంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆదివారం ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి ధనలక్ష్మి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా మహిళలు భక్తిశ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించారు.