ప్రకాశం: మార్కాపురంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం భారీ జనసందోహం మధ్య ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ ఇన్ఛార్జి అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట్రెడ్డితో కలిసి వచ్చిన ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
భారీ ర్యాలీతో వైసిపి అభ్యర్థి కనకదుర్గ నామినేషన్


