హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల డిపాజిట్లు వివరాలు

AKP: స్థానిక సంస్థలకు అభ్యర్థుల నామినేషన్ డిపాజిట్ వివరాలు కోటవురట్ల ఏఆర్ఓ చంద్రశేఖర్ తెలిపారు. పంచాయతీ వార్డు సభ్యులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ బీసీలకు రూ.500, ఇతరులకు రూ.1,000 సర్పంచ్, ఎంపీటీసీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ బీసీలకు రూ.1,500,ఇతరులకు రూ.3,000 చెల్లించాలన్నారు. జెడ్పీటీసీకి ఎస్సీ, ఎస్టీ బీసీలకు రూ.3,000, ఇతరులకు రూ.6,000గా నిర్ణయించినట్లు తెలిపారు.