హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుగ్గలిలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

KRNL: స్థానిక ఎన్నికల నేపథ్యంలో తుగ్గలి మండలంలో రౌడీ షీటర్లకు ఎస్‌ఐ బాల నరసింహులు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో అల్లర్లు, గొడవలకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆదివారం తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బైండోవర్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.