హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛైర్మన్ అభ్యర్థిగా లాజర్ బాబు ఖరారు

KKD: పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి SC జనరలకు కేటాయించడంతో జనసేన అభ్యర్థిని మార్చింది. తొలుత డాక్టర్ బీర విజయశేఖర్ పేరును ప్రకటించగా, పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న దానం లాజర్ బాబుకు అవకాశం ఇవ్వలేదని శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో చివరికి కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా లాజర్ బాబు పేరును ఖరారు చేశారు.