హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా

SS: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.