హైదరాబాద్: 28°C
వార్తలు

జనగణన నోటిఫికేషన్ వెనక భారీ కుట్ర: కాంగ్రెస్

జనాభా లెక్కల కోసం ఎన్యూమరేటర్ల అర్హత జాబితాను విస్తరిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక భారీ కుట్ర ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. తాజా నోటిఫికేషన్ పూర్తిగా RSS, బీజేపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు. RSSను జనగణన ప్రక్రియలోకి దూర్చేందుకే నిబంధనలను మార్చిందని మండిపడ్డారు. ఇది పరోక్షంగా వారికి ఉపాధి హామీ పథకం లాంటిదని ఎద్దేవా చేశారు.