హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీకి డబుల్ ఛాలెంజ్!

VZM: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, మున్సిపల్ పోరు ఒకేసారి రావడంతో విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌కు కఠిన సవాల్ ఎదురుకానుంది. లక్షలాదిగా వచ్చే భక్తులు, ఓటర్లతో నగరం కిక్కిరిసిపోనుండటంతో పోలీసులకు బందోబస్తు నిర్వహణ కత్తిమీద సాములా మారింది. తగినంత సిబ్బంది లేకపోవడంతో డ్రోన్లు, సీసీ కెమెరాల సాంకేతికతతో నిఘా పెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది.