హైదరాబాద్: 28°C
వార్తలు

350 ఏళ్లుగా వింత సంప్రదాయం!

MH సతారా జిల్లా పాండే గ్రామంలో 350 ఏళ్లుగా వింత సంప్రదాయం కొనసాగుతోంది. కాల భైరవనాథ్ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా 'ఉభ్యాచి నవరాత్ర' వ్రతాన్ని పాటిస్తారు. 18-65 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు 9 రోజుల పాటు నేలపై కూర్చోకుండా, పడుకోకుండా నిలబడే ఉంటారు. ఊయలలాంటి ఏర్పాటుపై కొంత విశ్రాంతి తీసుకున్నా.. ఒక కాలు మాత్రం నేలపైనే ఉంచుతారు. ఇలా ఒక్కొక్కరూ 3 నుంచి 10 ఏళ్ల పాటు వ్రతం పాటిస్తారు.