హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి

NDL: బనగానపల్లె మండలం టంగుటూరులో దసరా నవరాత్రుల ఎనిమిదో రోజు ఆదివారం శ్రీ పెద్దమ్మతల్లి దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా అలంకరించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు.