హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'PGRS కార్యక్రమం రద్దు'

VZM: జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమలులోకి వచ్చినందున, కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS,  డైలీ గ్రివెన్స్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల కోడ్ అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 03 వరకు అమలులో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.