హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో ఎన్నికలకు దూరంగా వైసీపీ

అన్నమయ్య: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, పోలీసుల ఆంక్షలతో నిష్పక్షపాత ఎన్నికలు సాధ్యం కావడం లేదని ఆరోపించారు. తనను నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాబోయే రోజుల్లో ప్రజలే కూటమికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.