తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా 2025-26 ఏడాదికి సంబంధించి 60 రోజుల వేతానానికి సమానమైన బోనస్ను ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు కనిష్టంగా రూ.7 వేల నుంచి గరిష్టంగా రూ.13,816 వరకు బోనస్ వస్తుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య రిటైర్ అయిన లేదా సర్వీసు నుంచి తప్పుకున్న వారికి కూడా ఈ బోనస్ వర్తిస్తుంది.
వార్తలు
ఉద్యోగులకు కేంద్రం శుభవార్త


