హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

శ్రీకాకుళం: స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలలో ఛైర్మన్,కౌన్సిలర్స్ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. చివరిరోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21తో ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. 28న పోలింగ్ ఉంది.