హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాలయాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

ATP: విజయదశమి వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా అనంతపురం జిల్లాలో దేవాలయాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని SP జగదీష్ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ఆకతాయిలు, పిక్ పాకెట్ల నియంత్రణకు 'శక్తి బృందాలను' రంగంలోకి దించామన్నారు. రహదారి భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు, ఇళ్లకు తాళాలు వేసేవారు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.