KRNL: ఎమ్మిగనూరు మండలం కడివెళ్లలో పోలీసులు కార్డాన్ సెర్చ్ ఆదివారం నిర్వహించారు. అనుమానితులు, రౌడీషీటర్లు, వివాదాస్పద వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దొంగతనాలు, కిడ్నాప్లు, అత్యాచారాలు వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరులో పోలీసుల కార్డాన్ సెర్చ్


