హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DROకు ఫారం-ఏ అందజేసిన జనసేన నేతలు

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టి.సి. వరుణ్ డీఆర్వో మలోలకు 'ఫారం-ఏ' పత్రాలను అందజేశారు. పోటీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఎంపికలో ఇది కీలక అడుగు అని నేతలు తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ మహిళా కో-కన్వీనర్ పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి పాల్గొన్నారు.