యూపీ నోయిడాలో నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వారి ఇంటిని పరిశీలించిన అధికారులు ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలైన వాంతులు, విరోచనాలు వంటి గుర్తులు కనిపించలేదని తెలిపారు. దీంతో బాధితులపై విషప్రయోగం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి విషయంలో బాదితుడికి, అతని తల్లి మధ్య విబేధాలు ఉండడంతో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు.
వార్తలు
నూడుల్స్ తిని ఐదుగురు మృతి కేసులో బిగ్ ట్విస్ట్


