భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, జీపీపల్లి పరిధిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. శ్మశానవాటిక సమీపంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో పుచ్చ రమణయ్య మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యుత్ లైన్లను తనిఖీ చేసి, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
విద్యుత్ తీగల ప్రమాదంలో వ్యక్తి మృతి


