హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

SDPT: గజ్వేల్ సద్దుల బతుకమ్మ పురస్కరించుకుని రాష్ట్ర ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అంతటా బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగాయన్నారు. రాష్ట్ర సాధనలో, ప్రగతి ప్రయాణంలో మహిళల పాత్ర గొప్పదని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికే ప్రాధాన్యమిచ్చి పలు పథకాలు విజయవంతంగా అమలు చేసిందని గుర్తుచేశారు.