హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొప్పుల రవికుమార్ ఇంటి వద్ద పోలీస్ పహారా

PLD: దాచేపల్లి వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. కోర్టు అనుమతితో నామినేషన్ దాఖలు చేసేందుకు రవికుమార్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ వేయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన దాచేపల్లి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది