SRD: సిర్గాపూర్ మండలం గౌడుగం శివారులో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోచారం గ్రామానికి చెందిన మారుతి (60) వాసర్ శివారులో బతుకమ్మ గునుకపూలు సేకరించి తిరుగు ప్రయాణమవుతుండగా గౌడుగం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు


