హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవీ నవరాత్రి వేడుకలకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రి వేడుకలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు మహబూబ్‌నగర్ ప్రజలందరిపై ఉండాలని కాంక్షించారు. ప్రజలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.