హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: BN రోడ్డు గుంతల్లో మొక్కలు నాటి నిరసన

దొండపూడి వద్ద బీఎన్ రోడ్డు గుంతల్లో ఇవాళ సీపీఎం ఆధ్వర్యంలో మొక్కలు నాటి వినూత్న నిరసన తెలిపారు. గుంతలు, దుమ్ముధూళితో ప్రయాణికులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు మండిపడ్డారు. శంకుస్థాపన చేసిన రోడ్డు పనులను ఎందుకు నిలిపివేశారో చెప్పాలన్నారు. వెంటనే పనులు చేపట్టకపోతే పాదయాత్ర చేపడతామని సీపీఎం నేత కె.గోవిందరావు హెచ్చరించారు.