హైదరాబాద్: 28°C
వార్తలు

కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. 12 మంది అరెస్ట్

కోల్‌కతాలోని చోర్‌బగా దుర్గాపూజా పండల్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి.. నిర్వాహకులు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల గురించి గందగోళంగా ఇచ్చిన ప్రకటనల వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. భక్తుల రద్దీ నిర్వహణలో నిర్వాహకులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తొక్కిసలాటలో 19 మంది మరణించగా.. 24 మంది గాయపడ్డారు.