హైదరాబాద్: 28°C
వార్తలు

దీప్కేకు కేంద్రమంత్రి ఆహ్వానం

2029 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎన్డీయే విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి రాందాస్ అఠావలే జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఈ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీజేపీ అధినేత అభిజిత్ దీప్కేను తన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో జాయిన్ కావాలని సాదరంగా ఆహ్వానించారు. అభిజిత్ నిజమైన అంబేద్కర్ వాది అయితే రావాలని కోరారు.