MLG: జిల్లాపరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు 3నెలల జీతాలు త్వరలో అందనున్నాయని స్కావెంజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. జీతాలఫైలును అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి బదిలీచేశారని, 3రోజుల్లో జీతాలు చెల్లిస్తామని డీఈవో హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. దసరా అనంతరం స్కావెంజర్ల ఖాతాల్లో జీతాలు జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
త్వరలో స్కావెంజర్లకు మూడు నెలల జీతాలు


